Friday, 21 August 2026
  • Home  
  • సంఘ ఆధారిత సంస్థల కీలక వ్యక్తులు నెట్వర్క్ ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సంఘ ఆధారిత సంస్థల కీలక వ్యక్తులు నెట్వర్క్ ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మండల కేంద్రమైన తాళ్ళరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో అనుకూల విధాన నిర్ణయాల కోసం లాబింగ్ అంశాలను గుర్తించడం మరియు నెట్వర్క్ ను బలోపేతం చేయడంపై సంఘ ఆధారిత సంస్థల కీలక వ్యక్తులతో మండల స్థాయి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోలీస్ శాఖ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ ఆధారిత సంస్థల కీలక వ్యక్తులు నెట్వర్క్ ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని తద్వారా అపరిష్కృత సమస్యలకు చరమగీతం పాడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ లాబీయింగ్ అంశాలను గుర్తించడం, వాటిని ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని సాధించుకునేలా ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది ఝాన్సీ మాట్లాడుతూ పలు న్యాయ విషయాలను గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని స్త్రీ పురుషులు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.