సంగం మండలం మర్రిపాడు గ్రామంలోని దేవాలయం సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ముందుగా మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!ప్రతి సంవత్సరం దేవాలయం సెంటర్ యూత్ ఆధ్వర్యంలో యువత అంతా ఒక్కటై గణనాథుని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ ఏడాది ప్రతిష్ఠించిన గణనాథుని విగ్రహాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది.వినాయకుని దర్శించుకుంటే విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
కావున సంగం మండల ప్రజలందరూ మర్రిపాడు గ్రామంలోని దేవాలయం సెంటర్కు విచ్చేసి, మా గణనాథుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవాలయం యూత్ కమిటీ తరపున కోరుకుంటున్నాము.



