శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ఉపాధి, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన పథకం ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ’ (VB-GRAM-G) పనులకు శ్రీకాళహస్తి నియోజకవర్గం వేదిక కానుంది. గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) పేరును మార్చి ఈ ఏడాది నుంచే ఈ కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏర్పేడు మండలం చింతలపాలెం గ్రామంలో ఈ పనులను నేరుగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రానున్నారు. ఈ నెల ఆఖరులో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సభా ఏర్పాట్లను, పనుల పురోగతిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

శ్రీకాళహస్తిలో కేంద్ర నూతన పథకం ‘వీబీ-జీ రామ్ జీ’ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన