ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మనుబోలు బైపాస్ క్రాస్ రోడ్ సమీపంలోని నిమ్మ తోటల్లో వెలసిన చిన్న షిరిడి సాయిబాబా మందిరంలో శ్రావణమాసం సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. అనంతరం మధ్యాహ్నం హారతి, సాయంత్రం కాగడ హారతి నిర్వహించారు. భక్తులు భజనలు, సాయి నామస్మరణలో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రావణమాసం సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మనుబోలు బైపాస్ క్రాస్ రోడ్ సమీపంలోని నిమ్మ తోటల్లో వెలసిన చిన్న షిరిడి సాయిబాబా మందిరంలో శ్రావణమాసం సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. అనంతరం మధ్యాహ్నం హారతి, సాయంత్రం కాగడ హారతి నిర్వహించారు. భక్తులు భజనలు, సాయి నామస్మరణలో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

