విశాఖపట్నం, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి):
దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్ రోడ్ నంబర్-4లో బొబ్బిలి ఆశ (20) ఆత్మహత్యకు పాల్పడింది. పొట్టిదొరపాలెంకు చెందిన ఆశకు 2023లో రామసాయి గణేశ్‌తో వివాహమైంది. శుక్రవారం సాయంత్రం భర్త విధులకు వెళ్లగా, రాత్రి 6.30 గంటలకు ఆశతో చివరిసారిగా మాట్లాడినట్లు తెలిసింది. శనివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు ఆశ మృతి చెందిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్ఐ నేతాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



