ఖమ్మం జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఖమ్మం నగరంలోని రోటరీ నగర్లో ఉన్న విజయ డైరీ మూసివేతకు సంబంధించిన వార్తల నేపథ్యంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, రుద్ర ప్రదీప్ నంబూరు రామలింగేశ్వరావ్ సభ్యులు గల నిజనిర్ధారణ కమిటీ గురువారం విజయ డైరీని సందర్శించింది.
ఈ సందర్భంగా డైరీ ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ వ్యవహారాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాల ఉత్పత్తిదారుల ఇబ్బందులపై కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. విజయ డైరీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, కార్మికులు, అనుబంధ కుటుంబాల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
విజయ డైరీ స్థల విస్తీర్ణం సుమారు 10 ఎకరాలు ఉండగా, ఆ భూమి మార్కెట్ విలువ దాదాపు రూ.700 కోట్ల వరకు ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. డైరీ మూసివేత వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కమిటీ నిర్ణయించింది.
రైతులు, కార్మికులు మరియు ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
కార్యక్రమం లో గుత్త వెంకటేశ్వర్లు, నాయుడు రాఘవ, భూక్యా శ్యాం సుందర్నాయక్, మంద సరస్వతి, డీ కొండా శ్యాం, తదితరులు ఉన్నారు


