Monday, 25 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తి గడ్డపై పసుపు సైన్యం కదం తొక్కాలి-ఎమ్మెల్యే బొజ్జల
- తిరుపతి

శ్రీకాళహస్తి గడ్డపై పసుపు సైన్యం కదం తొక్కాలి-ఎమ్మెల్యే బొజ్జల

శ్రీ కాళహస్తి, మే 25, (పున్నమి న్యూస్): తెలుగుదేశంకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మహానాడు’ పండుగను శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించడమే మన ధ్యేయమని స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీలలో జరగబోయే మహానాడు కార్యక్రమ ఏర్పాట్లపై నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, టీడీపీ ముఖ్య కేడర్‌తో ఎమ్మెల్యే తన కార్యాలయంలో ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో క్లస్టర్ల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించిన ఎమ్మెల్యే, రాబోయే మహానాడును విజయవంతం చేయడానికి నియోజకవర్గ శ్రేణులు ఏ విధంగా ముందుకు సాగాలి, ఏయే బాధ్యతలు నిర్వర్తించాలనే అంశాలపై పార్టీ ముఖ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ల స్ఫూర్తితో శ్రీకాళహస్తి గడ్డపై పసుపు సైన్యం కదం తొక్కేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. మన నియోజకవర్గ తిరుగులేని బలాన్ని రాష్ట్రానికి చాటిచెప్తూ, ఈ మహానాడును చారిత్రాత్మక విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆయన మనస్ఫూర్తిగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.