వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అల్లిక అంజయ్య తెలిపారు. అనంతరం గ్రామ దేవత బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వరుణ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ బాధ్యులు బెల్లి కొండల్‌రావు, పుల్లపు సత్యం కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.



