చైర్మన్గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు.. వైస్ చైర్మన్గా బోద్ధపు శివమ్మ
పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)
యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపల్ పరిధిలోని సోమలింగపాలెం పాఠశాలలో నిర్వహించిన స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చైర్మన్గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు, వైస్ చైర్మన్గా బోద్ధపు శివమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో యలమంచిలి మున్సిపాలిటీ జనసేన సీనియర్ నాయకురాలు కర్రీ ఝాన్సీతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.


