వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొనే పల్లె పండుగ–3 కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నట్లు అధికారులు, నాయకులు తెలిపారు. సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్, ప్రజలకు అవసరమైన వసతులను సిద్ధం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సభకు తరలివచ్చే ప్రజలకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

రామాపురంలో పల్లె పండుగ–3కు భారీ ఏర్పాట్లు