Saturday, 15 August 2026
  • Home  
  • తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల సబ్సిడీ
- రంగారెడ్డి

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల సబ్సిడీ

రేషన్‌దారులకు స్మార్ట్‌ కార్డులు తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల సబ్సిడీ హైదరాబాద్, ఆగస్టు 14: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 నిర్వహించనున్నారు. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో జరిగే సదస్సులో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా సదస్సు నిర్వహించనున్నారు. వానాకాలంలో ఏడు రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. యాసంగిలో సేకరించిన మిగులు ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,389 బేసిక్‌ ధరతో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు రూ.200 కోట్లతో ఈవీ ఆటో పథకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల ఫేజ్‌-2కు రూ.2,100 కోట్లకు ఆమోదం లభించింది.

రేషన్‌దారులకు స్మార్ట్‌ కార్డులు

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల సబ్సిడీ

హైదరాబాద్, ఆగస్టు 14: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 నిర్వహించనున్నారు. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో జరిగే సదస్సులో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా సదస్సు నిర్వహించనున్నారు.

వానాకాలంలో ఏడు రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. యాసంగిలో సేకరించిన మిగులు ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,389 బేసిక్‌ ధరతో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.

ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు రూ.200 కోట్లతో ఈవీ ఆటో పథకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల ఫేజ్‌-2కు రూ.2,100 కోట్లకు ఆమోదం లభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.