పున్నమి ప్రతినిధి
హైదరాబాద్
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో 3456 లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. రైతాంగానికి న్యాయం చేస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వ ధరణి వ్యవస్థలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల కోసం నిజాయితీతో పనిచేయాలని, ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని సర్వేయర్లను ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.


