నెల్లూరు జిల్లాలో ఇంధనంపై వదంతులు నమ్మవద్దు – ఎస్‌పి అజిత వేజెండ్ల హెచ్చరిక
27.04.2026 | SPSR నెల్లూరు జిల్లా: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల IPS తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులు నిరంతర నిఘా ఉంచి, సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వదంతులు వ్యాప్తి, బ్లాక్ మార్కెటింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


