ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయుడబ్ల్యూజే) తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షునిగా మండేల శ్రీరామ్మూర్తి, కార్యదర్శిగా ఎస్ వి వి. సత్యప్రసాద్, కోశాధికారిగా కర్రి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా కోసూరి అప్పారావు, కర్రి శ్రీనివాసరెడ్డి, యెనుముల విశ్వనాధం, పి.గంగరాజు, టి.రాము, సహాయ కార్యదర్శిలుగా ఎంబివి.సారధి, ఉండమట్ల దుర్గాప్రసాద్, నవదుర్గారెడ్డి, మహిపాల పాండురాజు, అప్పన చంద్రగుప్త లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వీరితోపాటు.. ఎగ్జిక్యూటివ్‌కమిటీ సభ్యులుగా లక్ష్మీనారాయణ, పాపారావు, తమలంపూడి వెంకటరెడ్డి, చింతా వీరాఘవరెడ్డి, ఎన్.రామకృష్ణ, కె.శ్రీనివాసరావు, సిర్రా కృపారావు, కెవివి. సత్యనారాయణ, రమేష్‌రాజా లు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ను.. రాష్ట్ర ప్రతినిధులు.. డి. సోమసుందరం, స్వాతిప్రసాద్, ఎన్నికల అధికారి దురాని, ది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సారధి తదితరులు ఘనంగా సత్కరించారు. జర్నలిస్టు సభ్యులంతా శుభాకాంక్షలు తెలిపారు.


