Thursday, 27 August 2026
  • Home  
  • రైస్ మిల్లులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు
- నిర్మల్

రైస్ మిల్లులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు

ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి నిర్మల్‌ జిల్లాలోని బైంసా, లోకేశ్వరం మండలాలలోని రైస్‌ మిల్లుల్లో మంగళవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం నిల్వల్లో భారీగా లోటు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. బైంసా మండలం దేగం శివారులోని శ్రీరామ రైస్‌ మిల్లులో 2022–23 సంవత్సరానికి సంబంధించి యాక్షన్ ప్యాడి పై అధికారులు తనిఖీలు చేపట్టారు. మిల్లుకు కేటాయించిన ధాన్యంలో 5,922 మెట్రిక్‌ టన్నులు ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో కేవలం 716 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో ధాన్యం నిల్వలు లోటుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిపారు. ఈ లోటు విలువ సుమారు రూ.11.64 కోట్లుగా పేర్కొన్నారు. ఈ రైస్‌ మిల్లు వంగ సుశీల పేరుపై ఉన్నట్లు, మిల్లును వంగ మహేందర్‌రెడ్డి నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే తనిఖీల సమయంలో మిల్లు యజమాని, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తి అధికారులకు అందుబాటులో లేకుండా వున్నారని సమాచారం. మరో పక్క లోకేశ్వరం మండలం పుస్పూర్ శివారులోని సీతారామ రైస్‌ ఇండస్ట్రీస్‌లోనూ భారీ లోటు గుర్తించారు. ఈ మిల్లుకు యాక్షన్ ప్యాడి కింద 6,306 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించగా, దాని విలువ సుమారు రూ.16.39 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో మిల్లులో కేవలం 25,575 ధాన్యం బస్తాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు రూ.14.10 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ మిల్లు యజమాని వంగ మహేందర్‌రెడ్డి కూడా అధికారులకు అందుబాటులో లేనట్లు తెలిసింది. రైస్‌ మిల్లుల్లో నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను సివిల్‌ సప్లైస్‌ అధికారులకు అందజేయనున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
నిర్మల్‌ జిల్లాలోని బైంసా, లోకేశ్వరం మండలాలలోని రైస్‌ మిల్లుల్లో మంగళవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం నిల్వల్లో భారీగా లోటు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. బైంసా మండలం దేగం శివారులోని శ్రీరామ రైస్‌ మిల్లులో 2022–23 సంవత్సరానికి సంబంధించి యాక్షన్ ప్యాడి పై అధికారులు తనిఖీలు చేపట్టారు. మిల్లుకు కేటాయించిన ధాన్యంలో 5,922 మెట్రిక్‌ టన్నులు ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో కేవలం 716 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో ధాన్యం నిల్వలు లోటుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిపారు. ఈ లోటు విలువ సుమారు రూ.11.64 కోట్లుగా పేర్కొన్నారు. ఈ రైస్‌ మిల్లు వంగ సుశీల పేరుపై ఉన్నట్లు, మిల్లును వంగ మహేందర్‌రెడ్డి నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే తనిఖీల సమయంలో మిల్లు యజమాని, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తి అధికారులకు అందుబాటులో లేకుండా వున్నారని సమాచారం. మరో పక్క లోకేశ్వరం మండలం పుస్పూర్ శివారులోని సీతారామ రైస్‌ ఇండస్ట్రీస్‌లోనూ భారీ లోటు గుర్తించారు. ఈ మిల్లుకు యాక్షన్ ప్యాడి కింద 6,306 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించగా, దాని విలువ సుమారు రూ.16.39 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో మిల్లులో కేవలం 25,575 ధాన్యం బస్తాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు రూ.14.10 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ మిల్లు యజమాని వంగ మహేందర్‌రెడ్డి కూడా అధికారులకు అందుబాటులో లేనట్లు తెలిసింది. రైస్‌ మిల్లుల్లో నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను సివిల్‌ సప్లైస్‌ అధికారులకు అందజేయనున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.