ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన మొబైల్ రీచార్జ్‌పై మోదీ సర్కార్ ఎందుకు దృష్టి పెట్టడం లేదు?ఉల్లిపాయలు, టమాటాలు పెరిగితే పార్లమెంట్‌లో చర్చించే ఎంపీలు.. ప్రతి ఒక్కరికి రోజువారీ నిత్యావసరమైన మొబైల్ రీచార్జ్ పెంపుపై ఎందుకు మాట్లాడటం లేదు?రూ.10, రూ.20, రూ,50, రూ.100, రూ.200 లాంటి రీచార్జ్‌లే లేకుండా చేశారు… దీనిపై ఏ ఒక్క అధికారి కానీ, ప్రభుత్వ పెద్ద కానీ మాట్లాడలేదు..ఇప్పుడు మినిమమ్ రూ.350 అంటున్నారు.. వీరిని ఇలాగే వదిలేస్తే రేపు నెలలో 25 రోజులకి రూ.500కు పెంచి పెడతారు..ప్రతి నెల రూ.500 అయినా.. రూ.1,000 అయినా ఉన్నవారికి ఏమీ కాదు.. లేనివారికి ఫోన్ వాడితే వాడండి, లేకపోతే మానేయండి అన్నట్లుగా వ్యవహరిస్తారా ఈ కంపెనీలు?ధరల గురించి అడిగితే మీరు దేశద్రోహులు అని ముద్ర వేస్తారా? లేక మొబైల్ రీచార్జ్‌ల ధరలను మోదీ సర్కార్ కట్టడి చేస్తుందా?


