Friday, 5 June 2026
  • Home  
  • తహసిల్దార్‌గా పదోన్నతి పొందిన పద్మజా కుమారి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తహసిల్దార్‌గా పదోన్నతి పొందిన పద్మజా కుమారి

అభినందనలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది ఆత్మకూరు, జూన్ 5 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి): ఆత్మకూరులో అడహక్ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పద్మజా కుమారికి పూర్తిస్థాయి తహసిల్దార్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు అందాయి. పదోన్నతి పొందిన సందర్భంగా సహచర ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.పద్మజా కుమారి రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో అడహక్ తహసిల్దార్ (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, పరిపాలనా అనుభవం, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రదర్శించిన చొరవ కారణంగా ఆమెకు ఈ పదోన్నతి లభించినట్లు అధికారులు తెలిపారు.ఇటీవల ఆత్మకూరుకు బదిలీపై వచ్చిన ఆమె అడహక్ తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి రెవెన్యూ పరిపాలనలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోనూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారని సహచర ఉద్యోగులు పేర్కొన్నారు.పూర్తిస్థాయి తహసిల్దార్‌గా పదోన్నతి పొందడం పట్ల రెవెన్యూ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పదోన్నతి సందర్భంగా పద్మజా కుమారి మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ సేవలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

అభినందనలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది

ఆత్మకూరు, జూన్ 5 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):

ఆత్మకూరులో అడహక్ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పద్మజా కుమారికి పూర్తిస్థాయి తహసిల్దార్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు అందాయి. పదోన్నతి పొందిన సందర్భంగా సహచర ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.పద్మజా కుమారి రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో అడహక్ తహసిల్దార్ (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, పరిపాలనా అనుభవం, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రదర్శించిన చొరవ కారణంగా ఆమెకు ఈ పదోన్నతి లభించినట్లు అధికారులు తెలిపారు.ఇటీవల ఆత్మకూరుకు బదిలీపై వచ్చిన ఆమె అడహక్ తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి రెవెన్యూ పరిపాలనలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోనూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారని సహచర ఉద్యోగులు పేర్కొన్నారు.పూర్తిస్థాయి తహసిల్దార్‌గా పదోన్నతి పొందడం పట్ల రెవెన్యూ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పదోన్నతి సందర్భంగా పద్మజా కుమారి మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ సేవలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.