చిట్వేలి: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయి వికాస్ పాఠశాలలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించి ప్రమాణస్వీకారం చేశారు.
సంస్థ అధ్యక్షులుగా దొండ్లవాగు శ్రీనివాసులు, కార్యదర్శిగా రామిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ట్రెజరర్‌గా తిరుమల రెడ్డి, ఆత్మీయ సహకార అధ్యక్షులుగా చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, గౌరవ డైరెక్టర్‌గా తిరుమల విశ్వనాథం, చైర్మన్‌గా సమ్మెట వీరాంజనేయులు, కో-చైర్మన్‌గా కుంభగిరి మునిరావు, కో-కన్వీనర్‌గా కరీంబాయి సాయిరాం ఎన్నికయ్యారు. అదేవిధంగా అడ్వైజర్ బోర్డు, డైరెక్టర్ బోర్డు, సభ్యులుగా మరో 20 మందిని ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మానవతా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, అభాగ్యులకు సహాయ సహకారాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సంస్థ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటిస్తూ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తరించి పేదలకు మరింత సేవ చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో కట్ట రామ్మోహన్ రావు, చౌడవరం మురళీ రెడ్డి, కావేరి చంద్రతో పాటు సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మానవత చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
చిట్వేలి: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయి వికాస్ పాఠశాలలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించి ప్రమాణస్వీకారం చేశారు. సంస్థ అధ్యక్షులుగా దొండ్లవాగు శ్రీనివాసులు, కార్యదర్శిగా రామిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ట్రెజరర్‌గా తిరుమల రెడ్డి, ఆత్మీయ సహకార అధ్యక్షులుగా చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, గౌరవ డైరెక్టర్‌గా తిరుమల విశ్వనాథం, చైర్మన్‌గా సమ్మెట వీరాంజనేయులు, కో-చైర్మన్‌గా కుంభగిరి మునిరావు, కో-కన్వీనర్‌గా కరీంబాయి సాయిరాం ఎన్నికయ్యారు. అదేవిధంగా అడ్వైజర్ బోర్డు, డైరెక్టర్ బోర్డు, సభ్యులుగా మరో 20 మందిని ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మానవతా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, అభాగ్యులకు సహాయ సహకారాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సంస్థ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటిస్తూ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తరించి పేదలకు మరింత సేవ చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో కట్ట రామ్మోహన్ రావు, చౌడవరం మురళీ రెడ్డి, కావేరి చంద్రతో పాటు సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

