_*CCE లక్ష్యాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన నూతన మూల్యాంకన విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి*_
_విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి,_
_*బత్తిరాజు శశియాదవ్, RUPPTS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*_
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 31/0 8/2026*
*రాష్ట్ర పాఠశాల విద్యలో విద్యార్థుల సమగ్ర వికాసం, ఒత్తిడి లేని అభ్యసనం, నిరంతర మూల్యాంకనం లక్ష్యంగా అమలులోకి వచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) విధానానికి విరుద్ధంగా సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA-1, SA-2) పరీక్షలకు External Evaluation విధానాన్ని ప్రవేశపెట్టడం ఆందోళనకరమని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (RUPPTS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిరాజు శశియాదవ్ అన్నారు.
ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, CCE అనేది కేవలం పరీక్షల విధానం కాదు.. విద్యార్థి సమగ్ర వికాసాన్ని నిరంతరం అంచనా వేసే విద్యా ప్రక్రియ అని పేర్కొన్నారు. విద్యార్థిని రోజువారీ తరగతి గదిలో పరిశీలిస్తూ, అతని సామర్థ్యాలు, లోటుపాట్లను గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దే బాధ్యత బోధిస్తున్న ఉపాధ్యాయుడిదేనన్నారు.
_*CCE స్ఫూర్తికి విరుద్ధంగా External Evaluation*_
బోధించిన ఉపాధ్యాయుడికి విద్యార్థి అభ్యసన స్థాయి, సామర్థ్యాలు, లోటుపాట్లపై పూర్తి అవగాహన ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో బయట ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించడం వల్ల CCE యొక్క మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుందని శశియాదవ్ అన్నారు.
_External Evaluation వల్ల విద్యార్థుల్లో గతంలో ఉన్న పరీక్షల భయం, ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉందని, ఇది భయరహిత అభ్యసనం అనే CCE లక్ష్యానికి విరుద్ధమని తెలిపారు._
_*విధానపరమైన నిర్ణయం ఏకపక్షంగా ఎలా?*_
_రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కీలకమైన విద్యా విధానంలో మార్పు తీసుకురావడం సాధారణ పరిపాలనా నిర్ణయం కాదని శశియాదవ్ స్పష్టం చేశారు._
> “CCE వంటి కీలక విద్యా విధానంలో మార్పు చేయడానికి ముందు ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది? ఏ అధ్యయనం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం స్థాయిలో దీనిపై చర్చ జరిగిందా? సంబంధిత స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకున్నారా?”
పైన ప్రశ్నలకు విద్యాశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విధానాన్ని అమలు చేయాల్సిన శాఖాధిపతి, స్వతంత్రంగా ఆ విధానం స్వరూపాన్నే మార్చే నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇంత కీలకమైన మార్పుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
_*పది కోట్లకు పైగా అదనపు వ్యయం.. టీచర్ల బోధన సమయం వృథా..*_
External Evaluation కోసం ప్రభుత్వంపై పది కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎంతో విలువైన ఉపాధ్యాయుల బోధనా సమయం మూల్యాంకన ప్రక్రియలో వినియోగించాల్సి వస్తుందని శశియాదవ్ తెలిపారు.
“ప్రజాధనం ఖర్చు చేసి, ఉపాధ్యాయుల బోధనా సమయాన్ని తగ్గించి, విద్యార్థులకు వాస్తవంగా ఏ అదనపు ప్రయోజనం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
_*RTE స్ఫూర్తికి అనుగుణంగా విద్యార్థి కేంద్రిత విధానం అవసరం*_
1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయకుండా విద్యా హక్కు చట్టం (RTE) స్ఫూర్తికి అనుగుణంగా విద్యను కొనసాగిస్తున్న నేపథ్యంలో, External Evaluation ద్వారా సాధించదలచుకున్న నిర్దిష్ట ప్రయోజనం ఏమిటో విద్యాశాఖ వెల్లడించాలని ఆయన కోరారు.
విద్యార్థులను పరీక్షల ఒత్తిడిలోకి నెట్టడం కాకుండా, వారి అభ్యసన లోటుపాట్లను గుర్తించి పరిష్కరించే నిరంతర, నిర్మాణాత్మక మూల్యాంకనమే అవసరమని అన్నారు.
_*External Evaluation ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలి*_
విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల బోధనా ప్రక్రియ, రాష్ట్ర విద్యా విధానంపై ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని తక్షణమే పునఃపరిశీలించి ఉపసంహరించుకోవాలని _*RUPPTS*_ డిమాండ్ చేసింది.
_ఒకవేళ CCE విధానంలో మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తే—_
📍విద్యారంగ నిపుణులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి.
📍ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలి.
📍కమిటీ నివేదికపై సమగ్రంగా చర్చించాలి.
_ఆ తదుపరి మాత్రమే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి._
“విద్యాశాఖలో తీసుకునే ప్రతి నిర్ణయం ఒక తరం పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం కాకుండా, విద్యారంగ నిపుణులతో చర్చించి, శాస్త్రీయ ఆధారాలపై నిర్ణయాలు తీసుకోవాలి. CCE లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్న External Evaluation విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, CCEని దాని అసలు స్ఫూర్తితో కొనసాగించాలి.” అని “బత్తిరాజు శశియాదవ్” ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.*


