విశాఖపట్నం జిల్లా, మధురవాడ (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 21: మారికవలస–తిమ్మాపురం మాస్టర్ ప్లాన్ రోడ్డు సమీపంలో గురువారం సాయంత్రం యువకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రంపాలెం ఉన్నత పాఠశాల వద్ద చిన్నగా ప్రారంభమైన తగాదా, అనంతరం మద్యం మత్తులో తీవ్ర దాడిగా మారింది. మారికవలస కాలనీ, శివశక్తినగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది యువకులు కలిసి నలుగురిపై దాడికి దిగగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుంది. దాడికి పాల్పడిన ముగ్గురు మేజర్లు, ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
Uploaded Video:

