ఆత్మకూరు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): తిరుపతిలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో అస్వస్థతకు గురైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కావలి నియోజకవర్గానికి చెందిన పలువురు అభిమానులు ఆదివారం ఆత్మకూరులో పరామర్శించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, ఘటనపై తాము తీవ్రంగా ఆందోళన చెందామని, అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు ఎం.వి. రామిరెడ్డి, నాయుడు రాంప్రసాద్, నుడా మాజీ డైరెక్టర్ రంగారావు, సీనియర్ జర్నలిస్టు జయప్రతాప్ రెడ్డి, వెంకట్రావు, జాలరావు తదితరులు మంత్రిని కలిసి పరామర్శించారు.
అభిమానుల ఆందోళనను గమనించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందిస్తూ తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే అందరినీ కలుస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.

మంత్రి ఆనంకు అభిమానుల పరామర్శ
ఆత్మకూరు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): తిరుపతిలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో అస్వస్థతకు గురైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కావలి నియోజకవర్గానికి చెందిన పలువురు అభిమానులు ఆదివారం ఆత్మకూరులో పరామర్శించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, ఘటనపై తాము తీవ్రంగా ఆందోళన చెందామని, అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు ఎం.వి. రామిరెడ్డి, నాయుడు రాంప్రసాద్, నుడా మాజీ డైరెక్టర్ రంగారావు, సీనియర్ జర్నలిస్టు జయప్రతాప్ రెడ్డి, వెంకట్రావు, జాలరావు తదితరులు మంత్రిని కలిసి పరామర్శించారు. అభిమానుల ఆందోళనను గమనించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందిస్తూ తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే అందరినీ కలుస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.

