భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ, త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనా గుప్తా, పంజాబ్ అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్, ఢిల్లీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, త్రిపుర అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రాయ్ నియమితులయ్యారు.
పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జాట్ సిక్కు వర్గానికి చెందిన కేవల్ సింగ్ ధిల్లాన్‌ను పార్టీ ఎంపిక చేసింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ హర్యానాలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక మహిళకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం విశేషం.


