Friday, 4 September 2026
  • Home  
  • బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం
- మంచిర్యాల

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ, మోసపు హామీల 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రాష్ట్రంలోని ప్రజలు,రైతులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల చెందిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.