Wednesday, 1 July 2026
  • Home  
  • బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి… సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి… సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా    బిక్కవోలు, జూలై 1: బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి నియమితులైన సందర్భంగా మంగళవారం పందలపాకలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి నూతన మండల అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. చిన్నం వీర రాఘవరెడ్డికి అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.కె. రాజు, అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి రజని, బిక్కవోలు మండల బీజేపీ ఇన్‌చార్జి హేమ తులసి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గిరాడ గంగా భవాని, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి హెచ్‌డీఎస్ సభ్యుడు రవిశంకర్, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

 

బిక్కవోలు, జూలై 1: బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షుడిగా చిన్నం వీర రాఘవరెడ్డి నియమితులైన సందర్భంగా మంగళవారం పందలపాకలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి నూతన మండల అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. చిన్నం వీర రాఘవరెడ్డికి అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.కె. రాజు, అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి రజని, బిక్కవోలు మండల బీజేపీ ఇన్‌చార్జి హేమ తులసి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గిరాడ గంగా భవాని, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి హెచ్‌డీఎస్ సభ్యుడు రవిశంకర్, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.