శ్రీకాళహస్తి, మే 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్‌లో వెలసిన పొన్నాలమ్మ ఆలయానికి చిందేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ భక్తుడు గిరిధర్ రెడ్డి సుమారు రూ.35 వేల విలువైన మైక్ సెట్టును దానంగా అందజేశారు. దైవభక్తితో పాటు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే గిరిధర్ రెడ్డి, గతంలో చిందేపల్లిలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో శ్రీ సూదడేశ్వరాస్వామి ఆలయాన్ని నిర్మించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ ఆలయ ధర్మకర్తగా కొనసాగుతూ ప్రతి ఏడాది మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి పట్ల ఉన్న అపార భక్తితో పొన్నాలమ్మ దేవస్థానానికి మైక్ పరికరాలను సమర్పించిన గిరిధర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

పొన్నాలమ్మ ఆలయానికి భక్తుడి సేవా కానుక