శ్రీకాళహస్తి, మే 05 (పున్నమి న్యూస్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు మార్గదర్శకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పర్యవేక్షణలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన భోజన సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల ఆధునీకరణకు మంత్రి లోకేష్ చొరవతో కోటి రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ‘LEAP’ యాప్ వినియోగంతో బోధనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి విద్యార్థుల ప్రతిభ గణనీయంగా మెరుగుపడిందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సగటు మార్కులు 480 దాటగా, అధిక సంఖ్యలో విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధిస్తున్నారని వివరించారు. ఉపాధ్యాయుల కృషి, ప్రభుత్వ సంకల్పం కలిసి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దుతున్నాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కొత్త దిశ-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి