అనకాపల్లి జిల్లా, జూలై 24 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
అనకాపల్లి జిల్లా పోతిరెడ్డిపాలెం జంక్షన్‌లో వాహనదారులు, ప్రయాణికులు మరియు స్థానికుల కోసం రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఎస్సై ఉపేంద్ర మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని వివరించారు.
అలాగే వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులను పాటించడం, సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండడం, ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించడం వంటి భద్రతా నియమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల సంభవించే ప్రమాదాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాద రహిత సమాజ నిర్మాణమే పోలీసు శాఖ లక్ష్యమని పేర్కొన్న ఎస్సై ఉపేంద్ర, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

ప్రమాదాలకు చెక్.. పోతిరెడ్డిపాలెం జంక్షన్‌లో రూరల్ ఎస్సై ఉపేంద్ర రోడ్డు భద్రతా అవగాహన
అనకాపల్లి జిల్లా, జూలై 24 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) అనకాపల్లి జిల్లా పోతిరెడ్డిపాలెం జంక్షన్‌లో వాహనదారులు, ప్రయాణికులు మరియు స్థానికుల కోసం రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎస్సై ఉపేంద్ర మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని వివరించారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులను పాటించడం, సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండడం, ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించడం వంటి భద్రతా నియమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల సంభవించే ప్రమాదాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాద రహిత సమాజ నిర్మాణమే పోలీసు శాఖ లక్ష్యమని పేర్కొన్న ఎస్సై ఉపేంద్ర, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

