విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో సోమవారం గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసు నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. సరైన రికార్డులు లేని నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో ఎస్సై జగదీష్‌తో పాటు గాజువాక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


