శోంఠ్యం లో ప్రజలతో ముఖాముఖి!
విశాఖపట్నం జిల్లా,ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 25::
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పోలీస్ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆనందపురం మండలం శోంఠ్యం లో ప్రజా వేదిక వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో **”ప్రజలతో ముఖాముఖి”** కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ సిటీ పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, IPS, డీసీపీ జోన్-1 శ్రీ మణికంట చాందోలు, నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ శ్రీ ఎస్. అప్పలరాజు హాజరై గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడారు.
పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నియమావళి పాటించడం, ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడకుండా సంయమనం పాటించడం, ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సొంట్యాం, రామవరం, మామిడిలోవ, గండిగుండం గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, ఘర్షణలకు సంబంధించిన పరిస్థితులు ఎదురైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
**ఈ వివరాలను ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు.** ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని విధాలా చర్యలు చేపడుతోందని తెలిపారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్