పున్నమి ప్రతినిధి ఆనంద్ :
యలమంచిలి : ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే కూటమి ప్రభుత్వం పని చేస్తుందనీ ఏపీ రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు యలమంచిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్తాయి “స్పెషల్ గ్రీవెన్స్ – ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించగా నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుండి విచ్చేసిన ప్రజల స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకొని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ఈ ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ వంటి పలు పౌర సమస్యలపై ప్రజల నుండి పెద్ద ఎత్తున వినతులు అందాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పప్పల చలపతిరావు, లాలం భవాని భాస్కర్ , యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు, టౌన్ ప్రెసిడెంట్ శివ నారాయణమూర్తి, మండల టిడిపి అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, రాంబిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, పట్టణ కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, దాట్ల వెంకటస్వామి, యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం..
పున్నమి ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి : ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే కూటమి ప్రభుత్వం పని చేస్తుందనీ ఏపీ రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు యలమంచిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్తాయి “స్పెషల్ గ్రీవెన్స్ – ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించగా నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుండి విచ్చేసిన ప్రజల స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకొని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ఈ ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ వంటి పలు పౌర సమస్యలపై ప్రజల నుండి పెద్ద ఎత్తున వినతులు అందాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పప్పల చలపతిరావు, లాలం భవాని భాస్కర్ , యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు, టౌన్ ప్రెసిడెంట్ శివ నారాయణమూర్తి, మండల టిడిపి అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, రాంబిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, పట్టణ కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, దాట్ల వెంకటస్వామి, యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

