Tuesday, 22 September 2026
  • Home  
  • పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలి
- అనకాపల్లి

పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలి

– ఏపిటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. వెంకటపతి రాజు పున్నమి ప్రతినిధి ఆనంద్: యలమంచిలి యలమంచిలి, సెప్టెంబర్ 21: పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి మధ్యంతర ఉపశమనంగా ఐఆర్‌ ప్రకటించాలని ఏపిటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. వెంకటపతి రాజు ప్రభుత్వాన్ని కోరారు. యలమంచిలి మండలంలో ఏపిటీఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్‌లో భాగంగా సోమలింగపాలెం, జంపపాలెం, పెద్దపల్లి, హైస్కూల్ ప్లస్ బాలికల ఉన్నత పాఠశాల, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రభుత్వ పాఠశాల, కొత్తపేట పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి సంఘం సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఏపిటీఎఫ్ అధ్యక్షులు కర్రి ధర్మారావు, మండల అధ్యక్షులు ఏ. చంద్రశేఖర్, కార్యదర్శి ఎన్. భూషణం, కర్రి వీరభద్రరావు, మల్లిపాటి సత్యనారాయణ, బి. సత్యనారాయణ, వై. సత్యారావు, జి. సర్వేశ్వరరావు, బి. సింహాచలం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

– ఏపిటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. వెంకటపతి రాజు

పున్నమి ప్రతినిధి ఆనంద్: యలమంచిలి

యలమంచిలి, సెప్టెంబర్ 21: పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి మధ్యంతర ఉపశమనంగా ఐఆర్‌ ప్రకటించాలని ఏపిటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. వెంకటపతి రాజు ప్రభుత్వాన్ని కోరారు. యలమంచిలి మండలంలో ఏపిటీఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్‌లో భాగంగా సోమలింగపాలెం, జంపపాలెం, పెద్దపల్లి, హైస్కూల్ ప్లస్ బాలికల ఉన్నత పాఠశాల, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రభుత్వ పాఠశాల, కొత్తపేట పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి సంఘం సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఏపిటీఎఫ్ అధ్యక్షులు కర్రి ధర్మారావు, మండల అధ్యక్షులు ఏ. చంద్రశేఖర్, కార్యదర్శి ఎన్. భూషణం, కర్రి వీరభద్రరావు, మల్లిపాటి సత్యనారాయణ, బి. సత్యనారాయణ, వై. సత్యారావు, జి. సర్వేశ్వరరావు, బి. సింహాచలం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.