Tuesday, 22 September 2026
  • Home  
  • కన్నతల్లి ఆవు మృతి . తల్లి కోసం తల్లడిల్లిన ఆవు దూడ
- విశాఖపట్నం

కన్నతల్లి ఆవు మృతి . తల్లి కోసం తల్లడిల్లిన ఆవు దూడ

కారు ఢీకొని అక్కడికక్కడే మృతి.. దూడ రోదన చూసి చలించిన స్థానికులు విశాఖపట్నం జిల్లా,మారికవలస (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 22 :: మారికవలస రోడ్డులో మెట్రో సమీపంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న సాధు జంతువైన ఆవును కారు ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఆవు మృతదేహం వద్దకు చేరుకున్న దూడ.. తల్లి లేచి వస్తుందేమో అన్నట్లుగా చుట్టూ తిరుగుతూ కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. మాటలు రాని మూగజీవి కన్నీటి బాధను చూసి పలువురు స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. తల్లి లేని దూడను చూసిన క్షణం.. అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. మూగజీవుల పట్ల మానవత్వం, రహదారిపై వాహనదారుల అప్రమత్తత ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

కారు ఢీకొని అక్కడికక్కడే మృతి.. దూడ రోదన చూసి చలించిన స్థానికులు

విశాఖపట్నం జిల్లా,మారికవలస (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 22 ::
మారికవలస రోడ్డులో మెట్రో సమీపంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న సాధు జంతువైన ఆవును కారు ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.

తల్లి ఆవు మృతదేహం వద్దకు చేరుకున్న దూడ.. తల్లి లేచి వస్తుందేమో అన్నట్లుగా చుట్టూ తిరుగుతూ కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. మాటలు రాని మూగజీవి కన్నీటి బాధను చూసి పలువురు స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.

తల్లి లేని దూడను చూసిన క్షణం.. అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. మూగజీవుల పట్ల మానవత్వం, రహదారిపై వాహనదారుల అప్రమత్తత ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.