త్రాగునీరు, సాగునీరు, మున్సిపల్ మౌలిక వసతులపై ప్రత్యేక సమీక్ష
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం ఆత్మకూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా త్రాగునీరు, సాగునీరు, మున్సిపాలిటీ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
తేదీ 22-05-2026 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఆత్మకూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, సోమశిల, తెలుగు గంగ, రూరల్ వాటర్ సప్లై, మున్సిపల్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, సాగునీటి సమస్యలు, మున్సిపల్ మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేయనున్నారు.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.45 లక్షల చెక్కులను 49 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేయనున్నారు. తదుపరి మధ్యాహ్నం 3:30 గంటలకు ఆత్మకూరు మున్సిపాలిటీ మరియు ఆత్మకూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల స్థాయి, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కన్వీనర్లు, కో-కన్వీనర్లతో ప్రత్యేక సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ఈ సమావేశాలకు సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు, బాధ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్యాంపు కార్యాలయం, నెల్లూరు తరఫున విజ్ఞప్తి చేశారు.

