శ్రీ కాళహస్తి, జులై 12, (పున్నమి న్యూస్): జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముంబైలో భుజం నొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టే సాయిప్రసాద్ ఆధ్వర్యంలో అంబలి స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి దేవాలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి జయప్రకాశ్, జనసేన ప్రముఖ నాయకులు గరికపాటి చంద్రశేఖర్, కుమార్, రాఘవ, సాంబ, చైతన్య, నటరాజ్, మహేష్, నందకిషోర్ తదితరులు పాల్గొని సంఘీభావాన్ని చాటారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య కాంక్షతో శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమాలు