బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలోని 5 రైతుబజార్లు, 30 రైస్ మిల్లుల్లో మొత్తం 37 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు డీఎస్ఓ పుల్లయ్య అల్ఫా న్యూస్ తో తెలిపారు.ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరుకులను రాయితీ ధరలకు విక్రయిస్తున్నారు. కిలో బియ్యం రూ.52, కందిపప్పు రూ.122, మినపప్పు రూ.126, పామాయిల్ రూ.148, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.165 చొప్పున విక్రయిస్తూ సామాన్యులకు ఆర్థిక.భారం తప్పుతుందని అధికారులు తెలిపారు.

నెల్లూరు రైతుబజార్లలో రాయితీ సరుకులు.. వినియోగదారులకు ఊరట!