యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ముగ్ధంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఏకొత్త పథకం ప్రారంభించిన రాష్ట్ర మహిళల అందరికీ లబ్ధి చెందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో బీసీ కాలనీలో 10 లక్షల రూపాయలతో నూతన మహిళా భవనం నిర్మాణానికి ఈరోజు గ్రామ సర్పంచ్ శిగ నరేశ్ గౌడ్ గారు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈసందర్భంగా సర్పంచ్ శిగ నరేశ్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి రోజు నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మహిళల కోసం వంటింటి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం మహిళా సంఘాలకు గతంలో ఉన్న రుణాలకు వడ్డీ మాఫీ చేయడం మహిళా సంఘాలతో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్లను ఏర్పాటు చేయించడం ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ లక్ష అధికారులు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన అది మహిళలకు లబ్ధి చెందే విధంగానే మహిళలు కోటీశ్వరులు అయ్యే విధంగానే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు అందులోనే భాగంగా ఈరోజు గ్రామంలో సుమారు పది లక్షల రూపాయలతో మహిళా సంఘాల సభ్యులందరూ ఒకే దగ్గర కూర్చొని వారి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం బీసీ కాలనీలో నూతన మహిళా భవనం నిర్మాణం కొరకు ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. మూడు నెలల లోపే ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకొని భవనం ప్రారంభోత్సవానికి భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారితో ప్రారంభిస్తామని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే పరిష్కార దిశగా మేము పనిచేస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రాకేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి ఉపసర్పంచ్ శెట్టి సోనీ వార్డు మెంబర్లు గోపికృష్ణ సిసి కంబాల పరిశ్రమ వివో ఏ అందే భాగ్యశ్రీ మట్ట జహంగీర్ శెట్టి అశోక్ ఆకుల వెంకటేష్ అంజయ్య బాల నరసింహ మహిళలు మట్ట యశోద శిగ గీత ఆకుల మమత ధనలక్ష్మి నిర్మల లింగమ్మ అంజమ్మ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది…


