నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సవ్యంగా,శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో కోరారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికలపై స్టేజి 1, స్టేజి 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఎన్నికలలో సొంత నిర్ణయాలను తీసుకోవద్దని రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికలలో తప్పులు జరితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటినుండి ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుందని, అందువల్ల తప్పులు జరగకుండా ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్ ను, ఇతర నియమ, నిబంధనలను పూర్తిగా చదవడమే కాకుండా ముఖ్యమైన అంశాలను మార్క్ చేసుకోవాలన్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో రీపోల్ అన్నది లేకుండా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో మాలిక వసతులను కల్పించడం పై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.జిల్లా యంత్రాంగం తరఫున ఎన్నికల విధులలో నియమించే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఏ,డీఏలు సైతం చెల్లించడం జరుగుతుందని అధికారులు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి గ్రామపంచాయతీ ఎన్నికలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని పునరుద్గార్డించారు.

నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సవ్యంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సవ్యంగా,శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో కోరారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికలపై స్టేజి 1, స్టేజి 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఎన్నికలలో సొంత నిర్ణయాలను తీసుకోవద్దని రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికలలో తప్పులు జరితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటినుండి ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుందని, అందువల్ల తప్పులు జరగకుండా ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్ ను, ఇతర నియమ, నిబంధనలను పూర్తిగా చదవడమే కాకుండా ముఖ్యమైన అంశాలను మార్క్ చేసుకోవాలన్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో రీపోల్ అన్నది లేకుండా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో మాలిక వసతులను కల్పించడం పై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.జిల్లా యంత్రాంగం తరఫున ఎన్నికల విధులలో నియమించే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఏ,డీఏలు సైతం చెల్లించడం జరుగుతుందని అధికారులు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి గ్రామపంచాయతీ ఎన్నికలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని పునరుద్గార్డించారు.

