SPS నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలం – జీవం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రైన్‌వాటర్ హార్వెస్టింగ్ అమలు చేయడం, నీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


