పున్నమి ప్రతినిధి జులై 22: నాగర్‌కర్నూలు జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. 2,900 నకిలీ బస్తాల విక్రయాలు జరిగినట్లు గుర్తించి 9 మందిపై కేసు నమోదు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నడుపుతున్నట్లు తెలిపారు. నకిలీ ఎరువుల సమాచారాన్ని వెంటనే పోలీసులు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని కోరారు.
Uploaded Video:

