అబ్దుల్లాపూర్ మెట్ మండలం: (పున్నమి ప్రతినిధి) సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సంఘ సేవకుడు, ట్రీస్ సొసైటీ చైర్మన్ రేవల్ల మదన్ ఇటీవల డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్భంగా పుల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్, హయత్‌నగర్‌లో ఘనంగా సన్మానించారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మిత్రబృందం సమక్షంలో రేవల్లే మదన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్, ప్రముఖ ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి చేతుల మీదుగా రేవల్లే మదన్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ, సమాజ సేవకు అంకితమై నిస్వార్థంగా పనిచేస్తున్న రేవల్లే మదన్‌కు డాక్టరేట్ అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. యువత, విద్యార్థులు కూడా సేవా భావాన్ని అలవర్చుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
సన్మానం అందుకున్న రేవల్లె మదన్ మాట్లాడుతూ, తన సామాజిక సేవలను గుర్తించి సన్మానించిన పుల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ యాజమాన్యానికి, డైరెక్టర్ నరసింహారెడ్డికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు మిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ సమాజ సేవకు మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుడాల సందీప్ ముదిరాజ్, గన్నోజి శివకుమార్, కె. ఆనంద్ కుమార్, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, మహేష్ గౌడ్, టి. మల్లేష్ తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.




