14 డీఎస్సీలు వేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని, గతంలో తమ ప్రభుత్వాల హయాంలో 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తమ పాలనలో ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, 2029లోగా మరో 3 డీఎస్సీలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియనివారే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాయలు కాసిన చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయని, పిల్లలను గొప్పగా తీర్చిదిద్దే అద్భుత అవకాశం టీచర్లకే ఉందన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

14 డీఎస్సీలతో 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన వ్యక్తి సీబీఎన్: లోకేష్