వరుస నష్టాలతో సతమతమవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆక్వారైతులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో మరోసారి రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ కార్యచరణ కోసం ఈనెల 7న ఛలో అమలాపురం కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆక్వా పరిశ్రమ ఉన్న నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఆక్వా రైతు నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఉద్యమ కార్యచరణ ప్రకటించనున్నట్లు ఆక్వా రైతులు వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం అధ్యక్షతన అమలాపురంలో సమావేశమైన ఆక్వా రైతు నాయకులు ఈనెల 7న నిర్వహించే ఛలో అమలాపురం కార్యక్రమంపై చర్చించారు. ఈసందర్భంగా ఆక్వా రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న వరుస నష్టాలకు ఆక్వా రంగంలో సిండికేట్ వ్యవస్థ, దళారులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిండికేట్ వ్యవస్థ ప్రభుత్వాన్ని సైతం కనుసన్నల్లో ఉంచుకుని ఆక్వా రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఈ నెల 7న ఛలో అమలాపురం కార్యక్రమం ద్వారా భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఆక్వారంగ నాయకులు తరలిరావాలని కోరారు. ఛలో అమలాపురం కార్యక్రమం ద్వారా ఆక్వారైతులకు జరుగుతోన్న అన్యాయంపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం కమిటీ నాయకులు యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్వారైతుల పరిస్థితి ఆపరేషన్ సక్సస్ పేషెండ్ డెడ్ అన్న చందంగా మారిందని విమర్శించారు. ఆక్వారైతులు తీవ్ర నష్టాల్లోఉన్న ఈ సమయంలో ప్రభుత్వం ఆక్వా రంగాన్ని శాసిస్తున్న సిండికేట్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపకపోతే రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. మరో ఆక్వా రాష్ట్ర రైతు సంఘ కమిటీ నాయకులు అల్లూరి రమేష్ రాజు మాట్లాడుతూ అప్సడా చట్టం రైతులకా లేక ఆక్వా పరిశ్రమను శాసిస్తోన్న ఆక్వారం గ పరిశ్రమదారులకు వర్తించాదా అంటూ ప్రశ్నించారు.మరో రాష్ట్ర కమిటీ నాయకుడు దాట్ల పృద్వీరాజు మాట్లాడుతూ ఆక్వారైతులు వరుస నష్టాలనుంచి బయటపడాలంటే తమను తాము కాపాడుకునేందుకు అంతా ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో కోనసీమ జిల్లా కార్యదర్శి త్సవటపల్లి మణికంఠ, త్సవటపల్లి నాగేంద్ర, మేడిద శంకరం, మోటూరి నాని, మోటూరి కిరణ్, రుద్రరాజు కాశీరాజు, త్సవటపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమావేశాన్ని నిర్వహణకు పోలీస్ శాఖ అనుమతి కోసం డీఎస్పీని కలిశారు.ఆక్వా సమస్యలను శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకుసైతం వివరించి,ప్రభుత్వపరంగా సహకరించమని కోరామని రాష్ట్రఆక్వా రైతుల సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం,సభ్యులు అల్లూరి రమేష్ రాజు తెలియజేశారు.

నేడు అమలాపురం వేదికగా అపరిష్కృత సమస్యలపై ఆక్వా ఆక్రందన రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఉద్యమ కార్యచరణ కోసం సమావేశాల్లో నాయకులు బిజీ బిజీ