Sunday, 6 September 2026
  • Home  
  • వైభవంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..
- అనకాపల్లి

వైభవంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : ​యలమంచిలి : పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపేటలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ముందుగా భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విగ్రహానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకరికొకరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలను విద్యార్థులు పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను, గురువుల ప్రాధాన్యతను సవివరంగా వివరించారు. ​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంగపతి, కుందూరు రాజు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, అమరావతి, కోదండ రామలక్ష్మితో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :

​యలమంచిలి : పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపేటలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ముందుగా భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విగ్రహానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకరికొకరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలను విద్యార్థులు పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను, గురువుల ప్రాధాన్యతను సవివరంగా వివరించారు. ​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంగపతి, కుందూరు రాజు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, అమరావతి, కోదండ రామలక్ష్మితో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.