యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, స్కూల్ చైర్మన్ ఊడి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టతను వివరిస్తూ విద్యార్థులకు దేశ చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు వివిధ క్రీడలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మకత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల గౌరవం కలిగి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Uploaded Video:


