యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు జగన్నాథరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేశ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వివిధ ఆటలు, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Uploaded Video:


