పున్నమి ప్రతినిధి ఆగస్టు 21, అనంతసాగరం:
దళితుల, గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం మరియు కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగే సామాజిక శంఖారావం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కారం చేయాలని ఈ నెల 24వ తేదీ జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్వర్ బాషా కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో అనంతసాగరం మండలంలో ఉండే దళిత గిరిజన కాలనీలో ఆటో ప్రచార జాత నిర్వహించారు. ప్రచారజాత దృష్టికి దళితులు, గిరిజనలు అనేక సమస్యలను తీసుకొచ్చారని అన్నారు. ప్రధానంగా స్మశాన సమస్య మండలంలో ఎక్కువగా ఉందని అన్నారు.అలాగే పెన్షన్లు రాక అనేకమంది వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలన్నారు. మండలంలో భూ సమస్య తీవ్రంగా ఉందని దళితుల భూముల్ని ఆక్రమించుకుంటున్న అధికారులు చోద్యం చూస్తున్నారు అని అన్నారు. మండలంలో ఉండే భూ సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కారం చేయాలని అన్నారు. అనేక దళిత, గిరిజన కాలనీలో మౌలిక వసతులు మంచినీళ్లు, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. కొన్ని గ్రామాల్లో దళితుల స్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. అలాగే దళిత, గిరిజన కాలనీలో విపరీతంగా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయని వాటిని తొలగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24వ తేదీ సోమవారం రోజు జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళితులు, గిరిజనులు పాల్గొని తమ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అన్నారు. ఈ ప్రచార జాతను జన విజ్ఞాన వేదిక నాయకులు వేము పెంచలయ్య,గాడి సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఉప్పలపాడు మస్తాన్,కెవిపిఎస్ మండల నాయకులు జకరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగులూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


