संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
रंगारेड्डी

భక్తిశ్రద్ధలతో కొత్తపల్లి బోనాల జాతర.. భక్తులకు ఘన స్వాగతం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
భక్తిశ్రద్ధలతో కొత్తపల్లి బోనాల జాతర.. భక్తులకు ఘన స్వాగతం

కొత్తపల్లి గ్రామ బోనాల జాతరకు భక్తులకు ఘన స్వాగతం

గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

కొత్తపల్లి: గ్రామ దేవతలైన బీరప్ప స్వామి, మల్లన్న స్వామి, పోచమ్మ తల్లి, ఈదమ్మ తల్లుల బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ కాలె అనిత–రమేష్ దంపతులు హృదయపూర్వక స్వాగతం పలికారు.

బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలను కొలిచి, కుటుంబ సమేతంగా జాతరలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. గ్రామ దేవతల దివ్య ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.

బీరప్ప స్వామి ఆశీస్సులు, మల్లన్న స్వామి దీవెనలు, పోచమ్మ తల్లి కరుణ, ఈదమ్మ తల్లి అనుగ్రహంతో కొత్తపల్లి గ్రామం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని వారు కోరుకున్నారు.
భక్తులందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు.

– కాలె అనిత–రమేష్
కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్

భక్తిశ్రద్ధలతో కొత్తపల్లి బోనాల జాతర.. భక్తులకు ఘన స్వాగతం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *