సినిమాల్లోనే కాదు బయట కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ రేపుతుంది.. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.. ఎంత పెద్ద కేసు అయినా చిన్న క్లూ తో పరిష్కారం అవుతుంది అనేదానికి నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసే నిదర్శనం…చనిపోతూ ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇచ్చిన చిన్న క్లూ మొత్తం కేసును సులభతరం చేసింది. అదేంటో చూద్దాం.. ఈ నెల 11న రూపారెడ్డి హత్య జరిగింది.. కొద్దిసేపటికే పోలీసులకు తెలియడంతో వారు సంఘటన స్థలానికి వచ్చారు..హత్య జరిగిన తీరును చూసి షాక్ కు గురయ్యారు..డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వచ్చాయి.. ఎలాంటి ఆధారాలు లభించలేదు.. చుట్టుపక్కల సిసి కెమెరాల పుటేజ్ పరిశీలించారు.. అయినా ఒక్క క్లూ కూడా దొరకలేదు..ఇంత పకడ్బందీగా హత్య చేయడం ఎవరివల్ల సాధ్యం అవుతుంది అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.. విద్యార్థులు మర్డర్ చేశారనే చిన్న అనుమానం కూడా వాళ్లకు రాలేదు.. ఎందుకంటే మర్డర్ జరిగిన తీరు అంత భయానకంగా ఉంది కాబట్టి… కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేశారు.. వారిని విచారించడానికి ఒక టీం ఏర్పాటు చేశారు.. ప్రిన్సిపాల్ పార్టనర్స్ తో ఇబ్బందులు ఉన్నాయేమోననే వివరాలు తెలుసుకునేందుకు మరో పోలీస్ టీం ఏర్పాటు చేశారు.. వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా దొంగలు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో మరో టీంను ఏర్పాటు చేశారు.. ఇటీవల కాలంలో జైలు నుంచి ఎవరైనా సైకోలు రిలీజ్ అయ్యి ఈ పనికి ఒడిగట్టారా అనే కోణంలో ఇంకో టీం ను ఏర్పాటు చేశారు.. పాత కక్షలు ఉన్నాయేమోనని అనుమానంతో మరొక బృందాన్ని నియమించారు.. ఇలా ఐదు బృందాలను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలన జరిపినా ఒక్క క్లూ కూడా దొరకలేదు.. ఏమై ఉంటుంది.. ఎవరు చంపి ఉంటారు? ఇవే ప్రశ్నలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి… అప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం లోని పోలీస్ అధికారికి ఒక ఐడియా వచ్చింది.. రూపారెడ్డి ఫోన్ లో చివరి కాల్ ఎవరికీ వెళ్లిందో తెలుసుకోవాలనుకున్నారు.. వెంటనే ఫోన్ తనిఖీ చేయగా ఆమె తన పిన్నితో చివరి కాల్ మాట్లాడారు.. ఆమెను విచారించగా తనతో మాట్లాడుతుండగానే ఫోన్ స్విచాఫ్ అయ్యిందని ఆమె చెప్పింది.. అయితే చివరిసారిగా “బాబు ” అనే మాట ఆమె నోటి నుంచి వచ్చిందని వెంటనే ఫోన్ ఆగిపోయిందని తెలిపింది…ఆమె ఇచ్చిన ఈ క్లూ మొత్తం కేసునే క్లియర్ చేసింది… అసలు ఆమె బాబు అని ఎవరిని అని ఉంటారు.. పిన్ని తో మాట్లాడినప్పుడు బాబు అనే పదం ఎందుకు వస్తుంది.. అలా అని రూపారెడ్డి కొడుకును అన్నారా అంటే అతను హైదరాబాద్ లో ఉంటున్నాడు… దీనిని బట్టి ఆ సమయంలో ఆమెకు సడెన్గా ఇంటిలో ఎవరో కనిపించారు.. అందుకే బాబు అని అన్నది.. ఒక టీచర్ తన దగ్గర చదివే పిల్లలను మాత్రమే బాబు అంటారు.. దొరికేసింది.. పోలీసులకు క్లూ దొరికేసింది.. వెంటనే ఓ టీం రూపారెడ్డి ప్రిన్సిపాల్ గా చేస్తున్న నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ కి వెళ్ళింది.. అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించింది.. ఓ ఇద్దరు విద్యార్థులు 11 తేదీ తర్వాత బడికి రావడం మానేసినట్లు గుర్తించారు.. దీంతో వేట మొదలు పెట్టారు.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తం అంశాలన్నిటిని పరిశీలించగా వాళ్ళిద్దరే ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.. ఎంత పెద్ద కేసు అయినా చిన్న క్లూ తో పరిష్కారం అవుతుంది అనేదానికి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు నిదర్శనం… ఆమె చివరిసారిగా పలికిన ” బాబు ” అనే పదం ఒక ఇద్దరు కిరాతక విద్యార్ధులను పట్టుకునేలా చేసింది…



