విజయనగరం, సెప్టెంబర్ 23: తుఫాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. చెట్లు, చెరువులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, చిన్నారులను వరద ప్రవాహాల వద్దకు తీసుకెళ్లవద్దని తెలిపారు. రెడ్ అలర్ట్ తొలగించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు, పశువుల భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

తుఫాను తీరం దాటే వరకు అలసత్వం వద్దు: మంత్రి కొండపల్లి