Sunday, 16 August 2026
  • Home  
  • విధి నిర్వహణలో విశిష్ట సేవలు ఆత్మకూరు ఆర్డీవో పావనికి ప్రశంసా పత్రం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విధి నిర్వహణలో విశిష్ట సేవలు ఆత్మకూరు ఆర్డీవో పావనికి ప్రశంసా పత్రం

ఆత్మకూరు ఆర్డీవో బి. పావనికి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం. నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా పురస్కారం. ఆత్మకూరు సబ్-డివిజన్ లో ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పావని పలు అభివృద్ధి కార్యక్రమాలు, గ్రీవెన్స్ పరిష్కారం,ప్రజలకు సత్వర న్యాయం, అధికారులతో సమన్వయం, ఫీల్డ్ స్థాయిలో పర్యటనల ద్వారా సమస్యల పరిష్కారంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో అసాధారణ కృషి, పారదర్శకత, ప్రజా సేవల పట్ల చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఆత్మకూరు ఆర్డీవో బి. పావనిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన జండా వందనం కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆమె ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పావని సేవలను కొనియాడారు.ప్రశంస పత్రం అందుకున్న అనంతరం మాట్లాడిన బి. పావని ఇది నా ఒక్కదాని గౌరవం కాదు నాతో కలిసి పనిచేసిన సిబ్బంది,అధికారులందరి కృషికి దక్కిన గుర్తింపు. మున్ముందు మరింత బాధ్యతతో ప్రజా సేవ చేస్తానని తెలిపారు.

ఆత్మకూరు ఆర్డీవో బి. పావనికి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం. నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా పురస్కారం.

ఆత్మకూరు సబ్-డివిజన్ లో ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పావని పలు అభివృద్ధి కార్యక్రమాలు, గ్రీవెన్స్ పరిష్కారం,ప్రజలకు సత్వర న్యాయం, అధికారులతో సమన్వయం, ఫీల్డ్ స్థాయిలో పర్యటనల ద్వారా సమస్యల పరిష్కారంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో అసాధారణ కృషి, పారదర్శకత, ప్రజా సేవల పట్ల చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఆత్మకూరు ఆర్డీవో బి. పావనిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన జండా వందనం కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆమె ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పావని సేవలను కొనియాడారు.ప్రశంస పత్రం అందుకున్న అనంతరం మాట్లాడిన బి. పావని ఇది నా ఒక్కదాని గౌరవం కాదు నాతో కలిసి పనిచేసిన సిబ్బంది,అధికారులందరి కృషికి దక్కిన గుర్తింపు. మున్ముందు మరింత బాధ్యతతో ప్రజా సేవ చేస్తానని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.